Thursday 2nd July 2026
12:07:03 PM
Home > తాజా > “మీ వాహనాలు ర్యాంప్ వాక్ చేయడానికి కాదు”

“మీ వాహనాలు ర్యాంప్ వాక్ చేయడానికి కాదు”

  • డివైడర్‌పై స్కూటీ సాహసాలపై సజ్జనార్ సీరియస్!

VC Sajjanar On Scooty Stunt Video | రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉందని కొందరు వాహనదారులు చేసే వింత విన్యాసాలు, ప్రమాదకర స్టంట్లు తోటి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

తాజాగా ఓ వాహనదారుడు ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకోవడానికి ఏకంగా తన స్కూటీని రోడ్డు డివైడర్‌పైకి ఎక్కించి వెళ్లిన ఘటనపై సైబరాబాద్ మాజీ సీపీ, ప్రస్తుత టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా స్పందించారు.

సదరు వాహనదారుడు చేసిన ప్రమాదకర ప్రయాణాన్ని వెనుక ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా సజ్జనార్ దృష్టికి వెళ్లింది.

దాంతో ఆయన ఈ బాధ్యతారాహిత్య ప్రవర్తనపై గట్టిగా క్లాస్ పీకారు. డివైడర్లు మీ ద్విచక్ర వాహనాల ‘ర్యాంప్ వాక్’ కోసం కాదు: వైరల్ వీడియోపై సజ్జనార్ తన శైలిలో స్పందిస్తూ వాహనదారుల అతి తెలివిని, సాహసాలను తీవ్రంగా తప్పుబట్టారు.

నిబంధనలపై గౌరవం లేదు..

“వాహనదారుడి తలపై కనీసం హెల్మెట్ లేదు, ట్రాఫిక్ నిబంధనలపై అస్సలు గౌరవం లేదు.. కేవలం డేర్ డెవిల్ విన్యాసాలు ప్రదర్శించాలనే తాపత్రయం మాత్రమే కనిపిస్తోంది” అని ఆయన మండిపడ్డారు.  

రోడ్లపై ఉన్న డివైడర్లు ఇరువైపులా వచ్చే వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, రోడ్లను విభజించడానికి ఏర్పాటు చేసినవని.. అంతేకాని ద్విచక్ర వాహనాలు ఎక్కించి ‘ర్యాంప్ వాక్’ చేయడానికి కాదని ఆయన చమత్కరిస్తూనే ఘాటుగా హెచ్చరించారు.

కొద్ది నిమిషాల కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి..

ట్రాఫిక్‌లో కొద్ది నిమిషాల సమయాన్ని ఆదా చేసుకోవాలనే తొందరపాటు నిర్ణయాలు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో సజ్జనార్ వివరించారు. “కొద్ది నిమిషాల సమయం ఆదా చేయడం కోసం మీ అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టకండి.

ఇలాంటి ప్రాణాంతక సాహసాలు మిమ్మల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చవు.. నేరుగా యమపురికో లేదా హాస్పిటల్ బెడ్‌కో చేరుస్తాయి. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల పని కాదు.. అది ప్రతి ఒక్కరి కనీస బాధ్యత.” అని వీసీ సజ్జనార్ సూచించారు.

రోడ్డుపై వెళ్లేటప్పుడు సహనం వహించాలని, నిబంధనలు పాటిస్తూ తోటి ప్రయాణికుల భద్రతను కూడా గౌరవించాలని ఆయన ఈ సందర్భంగా వాహనదారులందరికీ హితవు పలికారు.

https://x.com/SajjanarVC_IPS/status/2072534865258725752

You may also like
vc sajjanar
వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు: వీసీ సజ్జనార్
tgsrtc green metro
ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీజీఎస్ఆర్టీసీ!
attack on ts rtc
ఆర్టీసీ బస్ పై దుండుగల దాడి.. తప్పిన ప్రమాదం!
Sajjanar
ఇదేం అభిమానం.. బిగ్ బాస్ షో ఫ్యాన్స్ పై ఆర్టీసీ ఎండీ అసహనం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions