- జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్‌తో సిరీస్..
- గిల్ కెప్టెన్సీలో వన్డే, టెస్ట్ స్క్వాడ్స్ ఇవే!
India Men Cricket Team Schedule 2026 | ఐపీఎల్ 2026 అట్టహాసంగా ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించి, రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
అయితే, ఈ మెగా టోర్నీ ముగిసిన వారం రోజుల్లోనే భారత క్రికెట్ జట్టు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానుంది. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగే సిరీస్‌తో టీమిండియా తన కొత్త సీజన్‌ను ప్రారంభించబోతోంది.
భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ సిరీస్ పూర్తి షెడ్యూల్..
భారత పర్యటనలో భాగంగా అఫ్గానిస్తాన్ జట్టు ఒక టెస్ట్ మరియు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు చండీగఢ్ ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతుంది. అయితే, ఈ టెస్ట్ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లోకి రాదు.
- మొదటి వన్డే: జూన్ 13 – ధర్మశాల
- రెండో వన్డే: జూన్ 17 – లక్నో
- మూడో వన్డే: June 20 – చెన్నై
ఈ హోమ్ సిరీస్ ముగిసిన వెంటనే మేన్ ఇన్ బ్లూ యూరప్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో 7 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లతో వరుస సిరీస్‌లు షెడ్యూల్ అయ్యాయి.
అఫ్గాన్ సిరీస్‌కు భారత జట్లు (Squads) ఇవే..
ఈ సిరీస్ కోసం యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బీసీసీఐ టెస్ట్ మరియు వన్డే జట్లను ప్రకటించింది. టెస్ట్ జట్టుకు సీనియర్ల విశ్రాంతి ఇవ్వగా, వన్డే జట్టులోకి రోహిత్, విరాట్ తిరిగొచ్చారు.
భారత టెస్ట్ జట్టు:
- శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).
భారత వన్డే జట్టు:
- శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
( రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటుపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది).
టీమిండియా కంప్లీట్ ఇంటర్నేషనల్ షెడ్యూల్ 2026 ఇదే..
| తేదీ/నెల | సిరీస్/పర్యటన | ఆతిథ్య దేశం | మ్యాచ్‌ల వివరాలు |
| జూన్ 6 – 20 | అఫ్గానిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా | భారత్ | 1 టెస్ట్, 3 వన్డేలు |
| జూన్ 26 – 28 | ఇండియా టూర్ ఆఫ్ ఐర్లాండ్ | ఐర్లాండ్ | 2 టీ20లు |
| జూలై 1 – 19 | ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ | ఇంగ్లాండ్ | 5 టీ20లు, 3 వన్డేలు |
| జూలై 23 – 26 | ఇండియా టూర్ ఆఫ్ జింబాబ్వే | జింబాబ్వే | 3 టీ20లు |
| తేదీ ఖరారు కావాలి (TBD) | ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక | శ్రీలంక | 2 టెస్టులు |
| సెప్టెంబర్ 27 – అక్టోబర్ 17 | వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా | భారత్ | 3 వన్డేలు, 5 టీ20లు |
| తేదీ ఖరారు కావాలి (TBD) | ఇండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్ | న్యూజిలాండ్ | 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు |
| డిసెంబర్ 13 – 27 | శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా | భారత్ | 3 వన్డేలు, 3 టీ20లు |







