Saturday 30th May 2026
12:07:03 PM
Home > క్రీడలు > IPLలో హార్దిక్ పాండ్యా సెంటిమెంట్.. అయితే ఈసారి ట్రోఫీ GTదేనా!

IPLలో హార్దిక్ పాండ్యా సెంటిమెంట్.. అయితే ఈసారి ట్రోఫీ GTదేనా!

  • సోషల్ మీడియాలో క్రేజీ సెంటిమెంట్ వైరల్!

Hardik Pandya Photoshoot Sentiment In IPL | | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పీక్స్‌ కు చేరింది.

ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది.

అయితే, ఈ మెగా ఫైనల్ కంటే ముందే సోషల్ మీడియాలో “హార్దిక్ పాండ్య కెప్టెన్సీ సెంటిమెంట్” విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈసారి గుజరాత్ టైటాన్స్ కప్పు కొట్టబోతోందంటూ నెటిజన్లు పాత రికార్డులను తెరపైకి తెస్తున్నారు.

ఏమిటీ హార్దిక్ పాండ్య క్రేజీ సెంటిమెంట్?
గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగే అఫీషియల్ కెప్టెన్ల ఫోటోషూట్ ఆధారంగా ఈ జోస్యం చెబుతున్నారు. ప్రతి ఏటా ట్రోఫీతో కలిసి అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫోటో దిగుతారు. అందులో హార్దిక్ పాండ్య పక్కన ఎవరు నిల్చుంటే.. ఆ సీజన్‌లో ఆ జట్టుకే కప్పు వస్తుండటం విశేషం.

2023 నుంచి సెంటిమెంట్..
ఈ ఏడాది ఫొటోషూట్‌లో హార్దిక్ పక్కన ఎంఎస్ ధోని నిల్చోగా.. ఆ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాతి ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పక్కన నిల్చోగా కేకేఆర్ ట్రోఫీని ముద్దాడింది.

2025 సీజన్  లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్, హార్దిక్ పక్కన నిల్చోవడంతో బెంగళూరు తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఈసారి శుభ్‌మన్ గిల్ వంతేనా?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో ఐపీఎల్ అధికారికంగా విడుదల చేసిన గ్రూప్ ఫొటోలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య పక్కనే గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్‌మన్ గిల్ నిల్చుని ఉన్నాడు.

గత మూడేళ్లుగా వంద శాతం నిజమైన ఈ ఫోటోషూట్ సెంటిమెంట్.. ఈసారి కూడా నిజమైతే గుజరాత్ టైటాన్స్ తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను గెలవడం ఖాయమని జీటీ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు.

ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ సవాల్..
అయితే మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. ఈ మూఢనమ్మకాలను బద్దలు కొట్టి వరుసగా రెండోసారి కప్పు గెలవాలని పట్టుదలతో ఉంది.

దీంతో ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్యే కాకుండా, ఒక క్రేజీ సెంటిమెంట్‌కు, పక్కా ప్లానింగ్‌కు మధ్య జరగబోయే యుద్ధంగా మారింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions