Monday 11th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అసెంబ్లీలో విజయ్ వైపు చూడని ఉదయనిధి స్టాలిన్!

అసెంబ్లీలో విజయ్ వైపు చూడని ఉదయనిధి స్టాలిన్!

udhayanidhi stalin

Udhayanidhi avoids Vijay | తమిళనాడు శాసనసభ (Tamilnadu Assembly) వేదికగా నేడు ఆసక్తికరమైన, అంతకంటే విచారకరమైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సభలో ఎంతో హుందాగా వ్యవహరించగా, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

సభ ప్రారంభమైనప్పటి నుండి సీఎం విజయ్ చాలా ప్రశాంతంగా కనిపించారు. ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో విజయ్ ఆయన వైపు చూస్తూ చిరునవ్వుతో పలకరించే ప్రయత్నం చేశారు.

కనీసం కళ్ళలోకి చూసి పలకరిస్తారని ఆశించినా, ఉదయనిధి మాత్రం విజయ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపు ఉదయనిధి స్టాలిన్ కిందకు చూస్తూ లేదా వేరే వైపు చూస్తూ కనిపించారు.

అధికార పీఠం చేజారిపోవడమే కాకుండా, తనకంటే జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి నేరుగా సీఎం కుర్చీలో కూర్చోవడాన్ని ఉదయనిధి జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నెటిజన్ల ఫైర్..
ఈ దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. “రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. కానీ కనీస మర్యాద పాటించకపోవడం ఏంటి?” అని కొందరు ప్రశ్నిస్తుంటే, “విజయ్ తన ప్రవర్తనతో ‘రియల్ లీడర్’ అనిపించుకున్నారు, ఉదయనిధి మాత్రం ఇంకా ‘వారసత్వ అహంకారం’లోనే ఉన్నారు” అంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు స్నేహితులు.. ఇప్పుడు ప్రత్యర్థులు..
గతంలో ఉదయనిధి స్టాలిన్ సినిమాలు నిర్మిస్తున్న సమయంలో విజయ్‌తో మంచి సంబంధాలు ఉండేవి. కానీ నేడు రాజకీయాల్లో ఇద్దరూ ఉద్ధండులైన ప్రత్యర్థులుగా మారడంతో, ఆ స్నేహం ఇప్పుడు కక్షగా మారిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions