Thursday 18th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గ్యాస్ బాంబు: కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంపు!

గ్యాస్ బాంబు: కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంపు!

Commercial Gas Price Hike | కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు, వ్యాపారులకు షాక్ ఇచ్చాయి.

చమురు సంస్థలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ. 993 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలు రూ. 3,000 మార్కును దాటేశాయి.

19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై రూ. 993 మేర ధరను పెంచారు. ఈ పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 3,071కి చేరుకోగా, హైదరాబాద్‌లో రూ. 3,315గా నమోదైంది.

5 కేజీల గ్యాస్ సిలిండర్ పై కూడా కేంద్రం రూ. 261 పెంచింది, దీంతో దీని ధర రూ. 900 దాటేసింది. డొమెస్టిక్ (గృహ వినియోగ) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం ఒక్కటే సామాన్య గృహిణులకు ఉపశమనం కలిగించే అంశం.

ఇరాన్-అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ‘హార్మూజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

ఈ అనిశ్చితి వల్ల గ్యాస్ ధరలను పెంచక తప్పడం లేదని చమురు సంస్థలు చెబుతున్నాయి. మార్చి నెలలో రూ. 144, ఏప్రిల్‌లో రూ. 195 పెంపు తర్వాత, ఇప్పుడు మే నెలలో ఏకంగా రూ. 993 పెంచడం వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions