- ‘చిన్నస్వామి’లో 11 సీట్లు శాశ్వతంగా రిజర్వ్!
11 Seats Reserved In Chinna Swamy | ఐపీఎల్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)జట్టుకు, వారి అభిమానులకు మధ్య ఉన్న బంధం మాటలకు అతీతమైనది.
గతేడాది జూన్ 4, 2025న ఆర్‌సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో జరిగిన విక్టరీ పరేడ్.. ఒక తీరని విషాదాన్ని మిగిల్చింది. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణు కోల్పోయారు.
ఆ మరణించిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ఆర్‌సీబీ యాజమాన్యం మరియు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ నుండి చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ 11 సీట్లను ప్రత్యేకంగా రిజర్వ్ చేయనున్నారు. ఈ సీట్లను ఎవరికీ విక్రయించరు.
ప్రాణాలు కోల్పోయిన ఆ 11 మంది అభిమానులు భౌతికంగా లేకపోయినా, వారు ఎప్పుడూ స్టేడియంలోనే ఉండి తమ జట్టును ప్రోత్సహిస్తున్నారనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్టేడియం లోపలికి ప్రవేశించే మార్గంలో, మ్యూరల్ సమీపంలో ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలోని జెయింట్ స్క్రీన్స్ పై మరణించిన అభిమానుల పేర్లను ప్రదర్శించి, ఒక నిమిషం పాటు మౌనం పాటించి వారికి నివాళులు అర్పిస్తారు.
కేవలం ఐపీఎల్ మ్యాచ్‌లే కాకుండా, చిన్నస్వామి స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా ఈ 11 సీట్లు రిజర్వ్ చేయనున్నారు.
2025లో ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత బెంగళూరు వీధుల్లో లక్షలాది మంది అభిమానులు పోటెత్తారు. చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద జరిగిన తోపులాటలో ఊపిరాడక 11 మంది యువ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లివర్‌పూల్ ఎఫ్‌సీ (Hillsborough Memorial) తరహాలో తమ అభిమానులకు శాశ్వత గౌరవాన్ని అందించేందుకు ఆర్‌సీబీ ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.






