SA vs NZ: Catch Controversy | టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం కోల్కత్తలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో సౌత్ ఆఫ్రికా జట్టును సునాయాసంగా చిత్తు చేసింది న్యూజిలాండ్. ఎప్పటిలాగే చివరి నిమిషంలో సౌత్ ఆఫ్రికా చేతులెత్తేసింది.
ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ధాటికి 170 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. చివర్లో మార్కో జాన్సెన్ అర్ధ శతకంతో ఆదుకోవడంతో సౌత్ ఆఫ్రికా జట్టు 169 పరుగులు చేయగలిగింది.
ఇదే సమయంలో కెప్టెన్ మార్కరమ్ ను ఔట్ గా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. రచిన్ రవింద్ర వేసిన ఎనిమిదవ ఓవర్ లో మార్క్ రమ్ భారీ షాట్ ఆడగా లాంగాన్ లో డరిల్ మిచెల్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. కానీ రీప్లేలో బాల్ గ్రౌండ్ కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ అని ఇచ్చాడు. దింతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.






