Sunday 30th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Pawan Kalyan On Botsa health | మాజీ మంత్రి, వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. గురువారం రాత్రి బొత్స బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడినట్లు, దింతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారని కథనాలు వస్తున్నాయి.

ఈ తరుణంలో పవన్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడినట్లు చెప్పారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions