Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇజ్రాయెల్ లో చరిత్ర సృష్టించనున్న మోదీ

ఇజ్రాయెల్ లో చరిత్ర సృష్టించనున్న మోదీ

PM Modi Israel visit | భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సాయంత్రం ఇజ్రాయెల్ దేశం చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని అక్కడకు వెళ్లారు. బుధవారం సాయంత్రం టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని విమానం ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దంపతులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ‘ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకి స్వాగతం’ అని నెతన్యాహు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగనుంది.

ఇకపోతే ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు ఏ భారత ప్రధానమంత్రి కూడా ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించలేదు. ఇలా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రధాని మోదీ రెండవ సారి ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్నారు. 2017లో ఆయన తొలిసారి ఆ దేశంలో పర్యటించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions