Sunday 30th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ సార్ మాకు రోడ్డు వెయ్యండి..చిన్నారుల అభ్యర్థన

పవన్ సార్ మాకు రోడ్డు వెయ్యండి..చిన్నారుల అభ్యర్థన

Vizianagaram Students Request to Pawan kalyan For Road | బడికి వెళ్లేందుకు రోజూ 12 కి.మీ. మేర కొండ దిగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన చిన్నారి విద్యార్థులు రోడ్డు వేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు. ‘పవన్ సార్ రోడ్డు వేయండి, మీకు దండం పెడుతాం’ అని చిన్నారుల అభ్యర్థనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారాపర్తి గ్రామ పంచాయతీ శివారులో అద్వాన్నంగా ఉన్న రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలో పలువురు విద్యార్థులు నిల్చొని కొత్త రోడ్డు వేయాలని పవన్ కళ్యాణ్ ను అభ్యర్థిస్తున్న వీడియో అందర్నీ భావోద్వేగానికి గురి చేసింది. చదువుకోవడానికి రోజూ 12 కి.మీ. మేర కొండ దిగాల్సి వస్తుందని ఆ చిన్నారులు తమ గోడును వివరించారు. చేతిలో పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని ‘డిప్యూటీ సీఎం సర్ మాకు రోడ్డు వెయ్యండి మీకు దండం పెడుతాం’ అంటూ కోరారు. కాగా గతంలో పలు గ్రామాల విద్యార్థులు కోరిన వెంటనే పవన్ కళ్యాణ్ రోడ్డు నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టిన విషయం తెల్సిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions