Saturday 23rd May 2026
12:07:03 PM
Home > తాజా > “45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు”

“45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు”

errabelli dayakar rao gets emotional

కన్నీరు పెట్టుకున్న ఎర్రబెల్లి!

Thorrur Municipal Chairman Election | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పరిణామలతో బీఆరెస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అక్కడి పరిస్థితులను ప్రస్తావిస్తూ ఒకింత కంట తడి పెట్టుకున్నారు.

చైర్ పర్సన్ఎ న్నికను తప్పుబడుతూ బోరున విలపించారు. చైర్మన్ ఎన్నికను అప్రజాస్వామికంగా నిర్వహించారని ఆరోపించారు. విప్ జారీ చేయాల్సిన తనను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు నిర్భందించారనీ, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

కోట్ల రూపాయల ఆశ చూసినా తమ కౌన్సిలర్లు లొంగలేదని.. ఎన్నికల వేళ కష్టపడిన కార్యకర్తలకు ఇప్పుడేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కక్ష సాధింపులు చూస్తుంటే అసలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? అనేది తెలియడం లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఎవరూ వ్యవహరించలేదన్నారు. బాధతో తనకు కన్నీళ్లు వస్తున్నాయని ఎమోషనల్ అయ్యారు. ప్రజలు తమకు పట్టం కడితే.. ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించదని ఆరోపించారు.

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions