Wednesday 12th August 2026
12:07:03 PM
Home > క్రీడలు > భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు..ఎన్ని వేల కోట్ల నష్టం అంటే!

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు..ఎన్ని వేల కోట్ల నష్టం అంటే!

How India Vs Pakistan ICC T20 WC Match Cancellation | ఐసీసీ టీ-20 ప్రపంచకప్ 2026లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ రద్దు అయిన విషయం తెల్సిందే. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడంతో రూ.వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ఒక్క మ్యాచ్ విలువ సుమారు రూ.4,500 కోట్లుగా ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ బహిష్కరించడం ఆ దేశ వక్ర బుద్ధిని బహిర్గతం చేసిన విషయం తెల్సిందే. ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా వివాదస్పదమైంది. మరోవైపు ఈ మ్యాచు రద్దుతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.

బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, ప్రకటనల ఆదాయం, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ అమ్మకాలు, డిజిటల్ స్ట్రీమింగ్ వంటి మార్గాల ద్వారా ఈ ఒక్క మ్యాచే రూ.4000 కోట్లకు పైగా జెనరేట్ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒక్క 10 సెకన్ల ప్రకటనకే రూ.22 నుంచి రూ.40 లక్షల వరకు రేట్లు ఉంటాయని అంచనా. ఈ మ్యాచ్ రద్దైతే బ్రాడ్‌కాస్టర్లకు మాత్రమే రూ.300 నుంచి 400 కోట్ల మధ్య నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రసార సంస్థలు భారీగా ప్రభావితమవుతాయి. బీసీసీఐ, పీసీబీ రెండింటికీ ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.200 కోట్ల చొప్పున నష్టం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌కు ఇది ఆర్థికంగా పెద్ద నష్టమేమీ కాదు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇది పెద్ద నష్టమే అని చెప్పవొచ్చు. మ్యాచ్ బహిష్కరణ వల్ల పాకిస్థాన్ పై జరిమానాలు, లీగల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో PCB ఆర్థికంగా కుదేలయ్యే ప్రమాదం ఉంది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions