Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం’

‘క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం’

BJP Leader Purandeswari Meets Nirmala Sitharaman | క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం అని నొక్కిచెప్పారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. ఈ మేరకు క్రెడిట్ కార్డుల విషయంలో RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు, కొన్ని చోట్ల 55%కి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని పురంధేశ్వరి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించడమే లక్ష్యంగా అమెరికాలో, అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు & పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions