Thursday 30th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నోబెల్ ఇవ్వలేదు..శాంతి గురించి ఆలోచించేదే లేదు

నోబెల్ ఇవ్వలేదు..శాంతి గురించి ఆలోచించేదే లేదు

Trump links Greenland threat to Nobel Peace Prize | నోబెల్ శాంతి పురస్కారాన్ని, గ్రీన్‌ల్యాండ్ అంశంతో ముడిపెట్టి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నార్వే ప్రధాని జోనస్ గార్ కు ట్రంప్ పంపిన ఓ సందేశం కలకలం రేపుతోంది. తాను ప్రపంచవ్యాప్తంగా ఎనమిది యుద్ధాలు ఆపినా నార్వే దేశం తనకు నోబెల్ బహుమతి ఇవ్వకూడదని నిర్ణయించుకుందని ట్రంప్ ధ్వజమెత్తారు. దింతో తాను ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

శాంతి అనేది ఎప్పటికీ ప్రధానమే అని కానీ అమెరికాకు ఏది మంచో దాని గురించే ఆలోచిస్తానని యూఎస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌ల్యాండ్ ను డెన్మార్క్ దేశం రష్యా, చైనా నుంచి రక్షించలేదన్నారు. అసలు డెన్మార్క్ దేశానికి గ్రీన్‌ల్యాండ్ పై యాజమాన్య హక్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించడం గమనార్హం. ప్రపంచం సురక్షితంగా ఉండాలంటే గ్రీన్‌ల్యాండ్ పై సంపూర్ణ నియంత్రణ అమెరికాకు దక్కాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సందేశం పై నార్వే ప్రధాని స్పందిస్తూ నోబెల్ బహుమతి ప్రకటన దేశం చేతిలో లేదని అది నోబెల్ కమిటీ నిర్ణయిస్తుందన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions