Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ తో హరీశ్ మాట్లాడింది అందరికీ తెలుసు: కవిత

సీఎం రేవంత్ తో హరీశ్ మాట్లాడింది అందరికీ తెలుసు: కవిత

kalvakuntla kavitha

Kalvakuntla Kavitha Chit Chat | తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) శాసన మండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన మండలి మెంబర్స్ లాంజ్ లో కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు.

తాను సెప్టెంబర్ 3న రాజీనామా చేస్తే నాలుగు నెలలుగా తన రాజీనామా యాక్సెప్ట్ చేయలేదన్నారు. ఇప్పుడు కౌన్సిల్ నడుస్తోంది కాబట్టి నా రాజీనామా యాక్సెప్ట్ చేసే ముందు ఫ్లోర్ లో నేను మాట్లాడే పర్మిషన్ ఇవ్వాలని ఛైర్మెన్ గారిని అడుగుతానన్నారు. హౌస్ లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటానని తెలిపారు.

నిన్న కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం మాట్లాడిన మాటలు ఆమోద యోగ్యం కాదన్నారు కవిత. ‘కేసీఆర్ ని ఉరి తీయాలి అంటున్నాడు. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలి. పాలమూరుకు తీరని అన్యాయం చేస్తున్నదే రేవంత్. ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడ్డ వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ను చెయ్యడం అన్యాయం. ప్రాజెక్టు సోర్స్ పాయింట్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కెసిఆర్ గారే అసెంబ్లీకి వచ్చి చెప్తే బావుంటుంది. హరీష్ రావు పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్నారు. ఆయన హౌస్ లో మాట్లాడితే అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది.

గతంలో సీఎం రేవంత్ రెడ్డి తో ఆయన ఛాంబర్ లో హరీశ్ రావు ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బీఆర్ఎస్ కు నష్టమే. బీఆర్ఎస్ పై మనసు విరిగింది.. కేసీఆర్ గారు పిలిచిన సరే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళేది లేదు. మొదటి నుండి నేను స్వతంత్రంగా పని చేశాను.

కేసీఆర్ గారి డైరెక్షన్లో హరీష్ కేటీఆర్ పని చేశారు. నేను జాగృతి జెండాతో ముందుకు వెళ్ళాను. తెలంగాణ కు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉన్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తాం. జాగృతి జనంబాటలో ప్రజల కష్టాలను కళ్లారా చూస్తున్న.  కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొత్త ఒక్క కరెంట్ పోల్ కూడా తండాలకు ఇవ్వడం లేదు. మిషన్ భగీరథ ను ఆగం చేశారు. తాగునీటి కోసం ప్రజలు, గిరిజనులు తండ్లాడుతున్నారు.’ అని వ్యాఖ్యానించారు కవిత.

You may also like
తిరుమల భక్తులకు ‘వెంకటాద్రి’ యాప్!
vc sajjanar
వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తే ఖాతా ఖాళీ!
25 ఏళ్ల తర్వాత అద్భుతం.. వర్షాకాలంలో నీటి పైకి తేలిన సంగమేశ్వర ఆలయం!
“మాజీ మావోయిస్టులు పార్టీలోకి రండి”.. కవిత సంచలన పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions