Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > మాజీ మంత్రితో పంచాయతీ..క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం

మాజీ మంత్రితో పంచాయతీ..క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం

Brahmanandam Clarity On Errabelli Dayakar Rao Photo Controversy | మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఫోటో తీసుకుందామని కోరగా నటుడు బ్రహ్మానందం తిరస్కరించి వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఓ వీడియో వైరల్ గా మారింది.

అయితే జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు బ్రహ్మానందం. కాగా ఇటీవల హైదరాబాద్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ ఈవెంట్ జరిగింది. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఎర్రబెల్లి దయాకరరావు, బ్రహ్మానందం సైతం వచ్చారు. కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఎర్రబెల్లి, బ్రహ్మనందం తారసపడ్డారు.

ఇదే సమయంలో ఫోటో తీసుకుందామని ఎర్రబెల్లి కోరగా బ్రహ్మానందం తిరస్కరించి లోనికి వెళ్లిపోయారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ క్రమంలో బ్రహ్మానందం సదరు వీడియోపై స్పందించారు. తనకు, ఎర్రబెల్లి మధ్య గత ముప్పై ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉందని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటామని హాస్య బ్రహ్మ పేర్కొన్నారు. మోహన్ బాబు ఫంక్షన్ కి ఆలస్యం అవుతుందని త్వరగా లోనికి వెళ్తున్నసమయంలో ఎర్రబెల్లి ఫోటో అడిగారని అయితే ఆయనతో ఉన్న చనువు కారణంగా ఉండండి ఇప్పుడు కాదు అంటూ ముందుకు వెళ్లిపోయినట్లు బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు. ఫంక్షన్ కు ముందు, ఆ తర్వాత ఎర్రబెల్లి, తాను చాలా సేపు మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వైరల్ గా మారిన వీడియోను చూసి నవ్వుకున్నట్లు చెప్పారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions