Saturday 8th August 2026
12:07:03 PM
Home > తాజా > ఆ ప్రచారం నమ్మొద్దు.. మా నాన్న బతికే ఉన్నారు: హీరోయిన్

ఆ ప్రచారం నమ్మొద్దు.. మా నాన్న బతికే ఉన్నారు: హీరోయిన్

esha deol

Dharmendra Death Rumors | బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Dharmendra) మృతి చెందారంటూ మంగళవార ఉదయం సోషల్ మీడియాతోపాటు పలు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కుమార్తె, నటి ఈషా డియోల్ తన తండ్రి మరణ వార్తను ఖండించారు. ఆయన ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

తమ కుటుంబం చెప్పే వరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. “మా నాన్న క్షేమంగానే ఉన్నారు. మేం ప్రైవసీని కోరుకుంటున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు” అని ఈషా డియోల్ పేర్కొన్నారు.

చికిత్సకు స్పందిస్తూ అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తి గురించి మీడియా ఇలాంటి వార్తలను ఎలా రాస్తుంది? ఇది క్షమించరానిది.” అంటూ ఫేక్ న్యూస్ పై ధర్మేంద్ర భార్య హేమా మాలిని మీడియా తీరును తప్పుబట్టారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
కంగనా వ్యాఖ్యలపై సోనూ సూద్ ఫైర్..
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions