Rahul Gandhi Alleges ‘Brazilian Model’ Among Fake Haryana Voters | హైడ్రోజన్ బాంబు పేరిట లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ప్రభుత్వం కలిసి హర్యానా ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీకి పాల్పడ్డాయని బాంబు పేల్చారు.
మొత్తం 2 కోట్ల ఓటర్లు ఉన్న హర్యానాలో ఏకంగా 25 లక్షలకు పైగా నకిలీ ఓట్లే ఉన్నాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియా ప్రజెంటేషన్ నిర్వహించారు. మొత్తం ఐదు పద్ధతుల్లో నకిలీ ఓట్లను సృష్టించారన్నారు. డూప్లికేట్ ఓట్లు, తప్పుడు చిరునామా, బల్క్ ఓట్లు, ఫారం 6, ఫారం 7ను దుర్వినియోగం చేయడం ద్వారా హర్యానా ఎన్నికల్లో 25 లక్షల 44 వేల ఫేక్ ఓట్లను సృష్టించారని ధ్వజమెత్తారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రెజిలియన్ మోడల్ కు హర్యానా ఎన్నికలతో సంబంధం ఏంటని నిలదీశారు. ఆమె పేరు తెలీదు, వయసు తెలీదు కానీ ఎన్నికల సమయంలో ఆమె పేరుతో 22 ఓట్లు నమోదు అయ్యాయని, 10 బూతుల్లో ఆమె ఓటు వేసిందన్నారు. బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టి సీమ, స్వీటీ, రష్మి ఇలా వివిధ పేర్లతో నకిలీ ఓటర్ ఐడీ కార్డులను సృష్టించారని రాహుల్ సెన్సేషన్ కామెంట్స్ చేశారు.








