News Rules for Aadhar Update | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకునే విధానంలో మార్పులు చేసింది. నవంబర్ 1 నుంచి ఆధార్ అప్డేట్ ప్రక్రియలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ తో ఆధార్ వివరాలను మరింత సులభంగా, వేగంగా ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ఇంటినుంచే మార్చుకోవచ్చు. అయితే, ఫింగర్‌ప్రింట్లు, ఐరిస్ స్కాన్, ఫోటో అప్‌డేట్ కోసం మాత్రం సేవా కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి.
ఈ వివరాల అప్‌డేట్ కోసం ప్రభుత్వ గుర్తింపు పత్రాలు అవసరం. పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం వంటి అధికారిక పత్రాలతో ఆధార్‌లో మార్పులు చేయవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం అప్‌డేట్ ఛార్జీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
పేరు, చిరునామా, మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడానికి రూ.75, బయోమెట్రిక్ వివరాలు మార్చడానికి రూ.125 చెల్లించాలి. 5–7, 15–17 సంవత్సరాల పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం. అయితే 2026 జూన్ 14 వరకు ఆధార్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి రూ.75 చెల్లించాలి.






