Friday 25th September 2026
12:07:03 PM
Home > తాజా > ఘనంగా టాలీవుడ్ హీరో వివాహం.. కొత్త జంట ఫొటోలు వైరల్!

ఘనంగా టాలీవుడ్ హీరో వివాహం.. కొత్త జంట ఫొటోలు వైరల్!

nara rohit weds sireesha lella

Nara Rohit weds Sireesha | తెలుగు సినీ పరిశ్రమలో మరో నటుడు ఓ ఇంటివాడయ్యాడు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుని కుమారుడు, నటుడు నారా రోహిత్ వివాహం శిరీషతో వివాహం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా కుటుంబ సభ్యులతో  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. “మా ఇంటి పెళ్లి సందడి. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం.

నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు” అని చంద్రబాబు పోస్ట్ చేశారు.

ఈ వివాహ వేడుకకు పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions