Wednesday 24th June 2026
12:07:03 PM
Home > తాజా > మొంథా ఎఫెక్ట్: అన్నదాతల గుండెకోత!

మొంథా ఎఫెక్ట్: అన్నదాతల గుండెకోత!

farmer
  • డ్రైనేజీలో వరి ధ్యాన్యం.. వరదలో ఆవులు
  • గుండెలు అవిసేలా రోదించిన రైతులు!

Montha Effect | మొంథా తుపాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక జిల్లాల్లో పట్టణాలను, గ్రామాలను వర్షం ముంచెత్తింది. ఈ తుపాన్ తో రెండు రాష్ట్రాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. వరి పంట చేతిక వచ్చి మార్కెట్ చేరిన ధాన్యం తడిపోయి అన్నదాతలను ముంచేసింది.

ఈ క్రమంలో తెలంగాణలోని హుస్నాబాద్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ఓ రైతు ధాన్యం డ్రైనేజిలో వరదకు కొట్టుకుపోయింది. దీంతో డ్రైనేజీలో మిగిలిపోయిన తడినస ధాన్యాన్ని ఎత్తుతూ ఓ మహిళా రైతు బోరున విలపించింది. ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాచుకున్న పంట ఇలా వర్షార్పణం కావడంతో ఆ రైతు గుండెలు అవిసేలా రొదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఓ వైపు నీటిని నుంచి ధాన్యాన్ని ఎత్తుతూ మరోవైపు అక్కడికి వచ్చిన కలెక్టర్ ను కాళ్లు మొక్కుతూ తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. మరోచోట నాగర్ కర్నూల్ జిల్లాలోని దేవరబండ అనే గ్రామంలో అకాల వర్షానికి పంట మునిగిపోయి, పాడి ఆవులు కొట్టుకుపోవడంతో ఓ రైతు బోరున విలపించాడు.

నాలుగు పాడి ఆవులతోపాటు రెండున్నర ఎకరాల వరి పంట, 20 క్వింటాళ్ల పత్తి, పైపులు కూడా వరదలో కొట్టుకుపోవడంతో రైతు గుండెలవిసేలా రోదించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నదాతలకు సాయం చేసి ఆదుకోవాలని నెటిజన్లు ప్రభుత్వాలను కోరుతున్నారు.

You may also like
Farmer
రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. క్వింటాల్‌కు రూ. 600 పైగా పెరిగిన ధర!
భారీ వర్షాలు..ముఖ్యమంత్రి ఆదేశాలు
sandeep reddy vanga
సీఎం రిలీఫ్ ఫండ్ కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విరాళం!
‘ఉక్కపోత నుండి ఉపశమనం..నగరంలో వర్షం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions