Tuesday 16th June 2026
12:07:03 PM
Home > తాజా > 15 నుంచి కళాశాలల బంద్ ?

15 నుంచి కళాశాలల బంద్ ?

Telangana private professional colleges strike from Sept 15 over unpaid fee dues | తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది.

ఫీజు రియంబర్సమెంట్ తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో సోమవారం నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేయనున్నట్లు సమాఖ్య ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్ల బకాయిలు రావాలని, కనీసం టోకెన్లు జారీ చేసిన రూ.1200 కోట్లను వెంటనే విడుదల చేయాలని సమాఖ్య పేర్కొంది.

సెప్టెంబర్ 15 నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మా, ఎంసీఏ, నర్సింగ్ కాలేజీలు బంద్ నిర్వహిస్తాయని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయించింది. మరోవైపు డిగ్రీ, పీజీ కాలేజీలు సైతం 16వ తేదీ నుంచి బంద్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు సమాఖ్య సభ్యులు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణరెడ్డిని కలిసి నోటీసు అందజేశారు. ఈ క్రమంలో ఒకవేళ బంద్ కనుక జరిగితే 10 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions