Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > హుస్సేన్ సాగర్ వద్ద సీఎం ఆకస్మిక పర్యటన

హుస్సేన్ సాగర్ వద్ద సీఎం ఆకస్మిక పర్యటన

CM Revanth Reddy Attends Ganesh Immersion At Tank Bund | హుస్సేన్ సాగర్ వద్ద ట్యాంక్ బండ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటన చేశారు. పరిమిత వాహనాలతో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి నిమర్జన ప్రక్రియను పరిశీలించారు.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా సీఎం రావడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ మీద క్రేన్ నంబర్ నాలుగు వద్ద నిమజ్జనాలను తిలకించారు. అనంతరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వేదికపైకి ఎక్కి భక్తులకు అభివాదం చేశారు.

అందరితో కలిసి గణపతి బప్పా మోరియా అని నినాదాలు చేశారు. అందరూ ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ హరిచందన సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా నిమజ్జన విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని సీఎం అభినందించారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions