• సేవ్ ఆర్గాన్స్-సేవ్ లైఫ్ పోస్టర్ ఆవిష్కరించిన నకిరేకల్ ఎమ్మెల్యే
• నియోజకవర్గంలో త్వరలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహణ
నకిరేకల్: ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల ఆంప్యుటేషన్స్ కి కారణమవుతున్న అనేక రకాల వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందిస్తున్న కేబీకే హాస్పిటల్ (KBK Hospital) సేవలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ప్రశంసించారు.
గ్యాంగ్రీన్, డయాబెటిస్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తదితర వ్యాధుల నుంచి అవయవాలను కాపాడాలనే సదుద్దేశంతో కేబీకే హాస్పిటల్ చేపట్టిన సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్ అనే ప్రచార పోస్టర్ ను ఎమ్మెల్యే గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ షుగర్ పుండ్ల కారణంగా కాళ్లు చేతులు కొట్టేయకుండా సరికొత్త చికిత్స అందిస్తున్న కేబీకే హాస్పిటల్ సేవలు అభినందనీయమన్నారు.
ఆయా వ్యాధులు, వాటి చికిత్సపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు కేబీకే హాస్పిటల్ కు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో త్వరలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పారు.
అనంతరం నిరుపేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు కేబీకే హాస్పిటల్ ప్రవేశ పెట్టిన కేబీకే హాస్పిటల్ సంపూర్ణ ఆరోగ్య కార్డు పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ హెల్త్ కార్డు ప్రయోజనాల గురించి హాస్పిటల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేబీకే హాస్పిటల్ ప్రతినిధులు జక్కి అరుణ్ కుమార్, వేదసాయి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.