Saturday 21st March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దసరా నుంచి జనసేన ‘త్రిశూల వ్యూహం’

దసరా నుంచి జనసేన ‘త్రిశూల వ్యూహం’

Janasena News Latest | దసరా నుంచి జనసేన పార్టీ త్రిశూల వ్యూహం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

కార్యకర్తలకు గుర్తింపు, నాయకత్వ సామర్థ్యం పెంపు, భద్రత అనే అంశాలు త్రిశూల వ్యూహంలో ప్రధాన అంశాలు అని పేర్కొన్నారు. మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ అనే నినాదంతో ముందుకు వెళ్లబోతున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు 15 సంవత్సరాల పాటు సుస్థిర ప్రభుత్వం అవసరమని నొక్కిచెప్పారు. పాలన తో పాటు పార్టీ కోసం రోజుకు నాలుగు గంటల సమయాన్ని కేటాయించబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నాయకత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అలాగే కార్యకర్తల సామర్థ్యం ఆధారంగా పదవులు ఉంటాయన్నారు. కాలంతో పాటు రాజకీయ సిద్ధాంతాల్లో మార్పులు అనివార్యం అని అన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions