Sandeep Reddy Vanga | తెలంగాణలో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వరదలతో జనజీవనం స్తంభించి పోయింది. భారీగా నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ వరదల కారణంగా బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించారు.
తన నిర్మాణ సంస్థ భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయ నిధికి రూ. 10లక్షలు విరాళం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ రోజు చెక్ ను అందించారు.










