Monday 14th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆరోజు శ్రీవారి ఆలయం మూసివేత.. భక్తులకు టీటీడీ కీలక ప్రకటన!

ఆరోజు శ్రీవారి ఆలయం మూసివేత.. భక్తులకు టీటీడీ కీలక ప్రకటన!

ttd

TTD Update | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను ఉద్దేశించి కీలక ప్రకటన జారీ చేసింది. సెప్టెంబర్ 7న తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబరు 7న చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తన్నట్లు తెలిపింది. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని మూసి, మరుసటి రోజు 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు జరిపే ఊర్జల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కాగా సెప్టెంబరు 7న మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తుల దర్శనాలను రద్దు చేసి, తిరిగి 8న సంప్రోక్షణల అనంతరం ఉదయం 6 గంటల తర్వాత దర్శనానికి అనుమతివ్వనున్నట్టు ప్రకటనలో తెలిపింది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions