Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > ఆ భాషలో డబ్ అయిన ఫస్ట్ మూవీ ఇదే.. !

ఆ భాషలో డబ్ అయిన ఫస్ట్ మూవీ ఇదే.. !

athadu movie facts

‌- అతడు సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

Athadu Movie Interesting Facts | సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) 50వ పుట్టినరోజు సందర్భంగా 20 ఏళ్ల కిందట ఆయన నటించిన అతడు సినిమాను ఆగస్టు 9న రీరిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

ఈ సందర్భంగా అతడు సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథను దర్శకుడు త్రివిక్రమ్ మొదట పవన్ కళ్యాణ్ తో తీయాలనుకున్నారు. ఆయన ఆసక్తి చూపకపోవడంతో మహేశ్ తో తెరకెక్కించారు.

ఈ సినిమా మహేశ్ తాత పాత్ర కోసం మొదట సీనియర్ నటుడు శోభన్ బాబును సంప్రదించారు. అయితే ఆయన సినిమాల నుంచి రిటైర్ అయ్యానని రిజెక్ట్ చేయడంతో నాజర్ నటించారు. 2005 ఆగస్టు 10న విడుదలైన అతడు సినిమాకు ఫస్ట్ వీక్ డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని ఏకంగా 175 రోజులు ఆడింది.

సినిమాలో టైటిల్ సాంగ్ మినహా అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. త్రివిక్రమ్ డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా అత్యధిక సార్లు టీవిల్లో టెలికాస్ట్ అయి రికార్డు సృష్టించింది. పోలాండ్ లోని పోలిష్ భాషలోకి డబ్ అయిన తొలి చిత్రం ఇదే.

సినిమా యాక్షన్ సీన్స్ లో టైమ్ ఫ్రీజ్ ఎఫెక్ట్ షాట్‌లను లండన్ నుండి దిగుమతి చేసుకున్న దాదాపు 160 మోషన్ కెమెరాలను ఉపయోగించి షూట్ చేశారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు బెస్ట్ యాక్టర్ గా, త్రివిక్రమ్ బెస్ట్ డైలాగ్ రైటర్ గా, సీహెచ్ శ్రీనివాస్ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డులు అందుకున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions