- గెస్ట్ ట్రైనర్ గా పాల్గొన్న ఏఐ నిపుణులు నిఖిల్ గుండా
- నేరాల నియంత్రణలో ఏఐ వినియోగంపై అవగాహన
AI Refresher Course For Police | నేటి డిజిటల్ ప్రపంచంలో నేరాల తీరు వేగంగా మారిపోతున్న తరుణంలో, పోలీస్ శాఖ సైతం తమ విధుల్లో టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో మేడ్చెల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పోలీసు అధికారులకు “పోలీస్ రిఫ్రెషర్ కోర్స్ – ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ మరియు డిజిటల్ ఎరా” అనే అంశంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణలో AI మరియు డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండా గెస్ట్ ట్రైనర్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణలో ఆధునిక టెక్నాలజీని ఎలా వినియోగించాలో ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరించారు.
ఈ సెషన్‌లో సోషల్ మీడియా వేదికగా పోలీస్ శాఖ ఎలా ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ చేయవచ్చు, అధికారిక సమాచారం ఎలా పంచుకోవాలి, ఫేక్ న్యూస్‌ను ఎలా ఎదుర్కోవాలి, AI టూల్స్ ను ఉపయోగించి విచారణను ఎలా వేగవంతం చేయాలో ముఖ్యంగా చూపించారు. డీప్ ఫేక్, ఫిషింగ్ స్కామ్స్, డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్, సోషల్ మీడియా అనాలిసిస్, వాయిస్ రికగ్నిషన్ వంటి అంశాలపై పోలీసులకు అవగాహన కల్పించారు.
ముఖ్యంగా, “పోలీసులకు టెక్నాలజీ ఇప్పుడు ఒక ఆయుధం లాంటిది. దాన్ని సమర్థవంతంగా వాడటం నేర్చుకోవాల్సిన అవసరం ఈ శిక్షణ ద్వారా స్పష్టమైంది,” అని నిఖిల్ గుండా వివరించారు.
ఈ శిక్షణను ప్రిన్సిపాల్ పి. మధుకర్ స్వామి గారు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించగా, లక్ష్మణ్ డీఎస్పీ గారు, ఇన్స్పెక్టర్లు కిరణ్, రవి, చంద్రశేఖర్ గారు శిక్షణ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించారు. ఈ శిక్షణతో పోలీస్ అధికారులు డిజిటల్ ప్రపంచంలో అవగాహన పెంచుకొని, నూతనమైన దృష్టితో తమ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లగలుగుతారు అనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగించింది.







