Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘IND vs PAK మ్యాచ్ చూడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు’

‘IND vs PAK మ్యాచ్ చూడడానికి నా మనస్సాక్షి ఒప్పుకోలేదు’

My Conscience Does Not Allow Me To Watch India vs Pak Match : Asaduddin Owaisi | పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారతీయులు మరణించిన తర్వాత ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచును చూడడానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ‘ఆపరేషన్ సింధూర్’ పై లోకసభలో జరిగిన ప్రత్యేక చర్చ సందర్భంగా ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచును చూసేందుకు తన మనస్సాక్షి అనుమతించదని వెల్లడించారు. ఆసియ కప్-2025 షెడ్యూల్ ఇటీవలే విడుదల అయ్యింది.

ఇందులో భాగంగా టీం ఇండియా-పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. అయితే దీనిపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఈ మ్యాచ్ ను నిర్వహించడం ద్వారా ఎటువంటి సంకేతం పంపుతున్నామని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాము, ఇప్పుడు మీరు ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచును చూడండి అని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. పాకిస్థాన్ విమానాలు దేశ గగనతలంలో ప్రవేశించలేనప్పుడు, వాణిజ్యం ముగిసిన తర్వాత, పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఎలా అనుమతినిస్తారు అని ఓవైసీ సభలో ప్రశ్నించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions