Saturday 14th March 2026
12:07:03 PM
Home > తాజా > డేవిడ్ వార్నర్ కు బాహుబలి కిరీటాన్ని పంపిన రాజమౌళి

డేవిడ్ వార్నర్ కు బాహుబలి కిరీటాన్ని పంపిన రాజమౌళి

SS Rajamouli Sends Baahubali Helmet To ‘Royal Fan’ David Warner | ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు బాహుబలి కిరీటాన్ని పంపనున్నట్లు ప్రకటించారు దర్శకధీరుడు రాజమౌళి.

దీనిపై స్పందించిన వార్నర్ రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సమయంలో వార్నర్ తెలుగు అభిమానులకు ఎంతో దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్నర్ తెలుగువారి మనసును గెలుచుకున్నారు.

తాజగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. బాహుబలి విడుదలై 10 సంవత్సరాలు అవుతున్న తరుణంలో రెండు భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’ ను మూవీ టీం అక్టోబర్ లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో వార్నర్ స్పందించారు.

బాహుబలి గెటప్ లో తానున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బాహుబలి గెటప్ తో దిగిన ఫోటో బాగుందా?, లేదా సాధారణ ఫోటో బాగుందా ? అని కాప్షన్ జతచేశారు. ఈ పోస్టుకు రాజమౌళి రిప్లై ఇచ్చారు. ‘హేయ్ డేవిడ్..నిజమైన మహిష్మతి రాజులా తయారవ్వండి. నేను కిరీటాన్ని పంపుతా’ అని రాజమౌళి పేర్కొన్నారు. కిరీటం కోసం ఎదురుచూస్తున్నట్లు వార్నర్ తెలిపారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions