Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘తెలంగాణ అంగన్వాడీలు—దేశానికి ఆదర్శంగా నిలవాలి’

‘తెలంగాణ అంగన్వాడీలు—దేశానికి ఆదర్శంగా నిలవాలి’

seethakka pressmeet

Minister Seethakka News | తెలంగాణ అంగన్వాడీలు దేశానికి ఆదర్శంగా నిలచే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇందులో అంగన్వాడీ సేవలను మెరుగుపరచడం, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.

వర్షాకాలంలో భవనాల సమస్యలను తక్షణం పరిష్కరించి, పిల్లల భద్రత, శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీతక్క ఆదేశించారు. జిల్లా అధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించి, హాజరు శాతాన్ని పెంచాలని, నవంబర్ 19 ఇందిరా గాంధీ జయంతి నాటికి 1000 కొత్త అంగన్వాడీ భవనాల ప్రారంభానికి నిర్మాణాలు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions