Saturday 7th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది’

‘కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది’

cm revanth reddy

Cm Revanth Reddy News | రాష్ట్రంలోని రైతులకు కావాల్సినంత యూరియా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమంగా సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. యూరియా స్టాక్ కు సంబంధించి ప్రతీ ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై డిస్ ప్లే చేయాలని అధికారులకు సూచించారు.

అలాగే స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. అలాగే సన్నబియ్యం పంపిణీతో రేషన్ కార్డుల విలువ పెరిగిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు.

You may also like
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
engineering fee in tg
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions