Saturday 19th September 2026
12:07:03 PM
Home > తాజా > భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్

భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్

Ravi Kishan reveals he touches his wife Preeti’s feet every night | పార్లమెంటు సభ్యుడు, నటుడు రవి కిషన్ తన సతీమణి గురించి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ప్రతీరోజు తన భార్య పాదాలకు నమస్కరించిన తర్వాతే తాను నిద్రపోతానని కారణం తన వద్ద ఏమీ లేని సమయంలో ఆమె తనకు ఎంతో అండగా నిలిచిందని చెప్పారు. రేసుగుర్రం మూవీ ద్వారా రవి కిషన్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే.

సన్ ఆఫ్ సర్దార్-2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ తో కలిసి రవి కిషన్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కిషన్ నిద్రపోయే ముందు సతీమణి పాదాలకు నమస్కరిస్తారని యాంకర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు.

దీనికి నటుడు నవ్వుతూ అంగీకారం తెలిపారు. తన వద్ద పేరు, పలుకుబడి లేని సమయంలో తన సతీమణి ప్రీతి కిషన్ అండగా నిలిచిందన్నారు. కష్టకాలంలో తన వెంటే ఉందని, తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం తన భార్యే అని రవి కిషన్ ఎమోషనల్ అయ్యారు.

అందుకే కృతజ్ఞతగా రోజు సతీమణి పాదాలకు నమస్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే ఇందుకు ప్రీతి కిషన్ అంగీకరించిందని అందుకోసమే ఆమె నిద్రపోయాకే పాదాలను తాకుతానని నటుడు చెప్పారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions