Monday 21st September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. మొత్తం 24 దేశాల నుంచి..!

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. మొత్తం 24 దేశాల నుంచి..!

modi in ghana

Modi In Ghana | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇటీవల పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా (Ghana) వెళ్లిన విషయం తెలిసిందే. ఆ దేశంలో అడుగు పెట్టిన మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

ఘనా అత్యున్నత పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. ఘనా అత్యున్నత పురస్కారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’  అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది. రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఘనా ప్రెసిడెంట్ అధ్యక్షుడు జాన్ మహామా ప్రధాని మోదీకి ఈ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఘనా దేశ జాతీయ పురస్కారంతో కలిపి ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా 24 దేశాల నుండి ఆయా దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు.

You may also like
ఇటలీ ప్రధాని మెలోని సరికొత్త రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు!
దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!
‘ఖేలో ఇండియా డైలాగ్’.. ప్రధాని మోదీ కీలక పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions