Wednesday 24th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఎన్టీఆర్ ఘాట్ లో మరమ్మతులు..ప్రభుత్వానికి లోకేశ్ కృతజ్ఞతలు

ఎన్టీఆర్ ఘాట్ లో మరమ్మతులు..ప్రభుత్వానికి లోకేశ్ కృతజ్ఞతలు

Nara Lokesh Thanks Telangana Govt. | హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో మరమ్మత్తులు పనులు జోరందుకున్నాయి. ఘాట్ ముఖద్వారం నుంచి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమాధి వరకు అన్నింటినీ నవీకరిస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఘాట్ కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. అవసమైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరమ్మత్తులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ స్పందించింది. ఎన్టీఆర్ ఘాట్ లో సుమారు రూ.1.3 కోట్ల వ్యయంతో మరమత్తుల పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం.. మహా నాయకుడు ఎన్టీఆర్ స్మృతివనం అయిన ఎన్టీఆర్ ఘాట్‌కు రూ.1.35 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ మరమ్మతులు చేపట్టడం చాలా సంతోషమన్నారు.

ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు లోకేష్ పోస్ట్ చేశారు.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions