Thursday 30th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘వరుసగా ఆరు సిక్సర్లు..వైరల్ గా మారిన పరాగ్ గత ట్వీట్’

‘వరుసగా ఆరు సిక్సర్లు..వైరల్ గా మారిన పరాగ్ గత ట్వీట్’

Riyan Parag becomes first batter in IPL to hit six sixes off successive balls | రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సంచలనం సృష్టించారు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు.

ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా రియాన్ నిలిచాడు. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచులో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కత్త-రాజస్థాన్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత్త 206 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన రాజస్థాన్ వరుసగా వికెట్లను కోల్పోయింది. ఒకానొక దశలో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించడానికి తీవ్రంగా శ్రమించారు.

ఈ సమయంలో మెయిన్ అలీ వేసిన ఓవర్ లో వరుసగా ఐదు సిక్సులు బాదేశాడు. అనంతరం వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్ లో ఎదురుకున్న తొలి బంతిని సిక్సర్ గా మలిచి వరుసగా ఆరు సిక్సులు కొట్టాడు. ఈ నేపథ్యంలో గతంలో రియాన్ పరాగ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఐపీఎల్ లో ఏదొక దశలో ఒకే ఓవర్ లో నాలుగు సిక్సులు కొడతానని తన మనస్సాక్షి చెబుతున్నట్లు మార్చి 14 2023లో రియాన్ ట్వీట్ చేశారు. రెండేళ్ల తర్వాత తన అంచనా నిజం అని తేలింది. దింతో గతంలో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చివరి వరకు పోరాడిన రాజస్థాన్ కేవలం ఒక్క పరుగు తేడాతో కోల్కత్త చేతిలో ఓడిపోయింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions