Wednesday 23rd September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సన్యాసాశ్రమంలో మోదీ పేరేంటో తెలుసా..బయటపెట్టిన పవన్!

సన్యాసాశ్రమంలో మోదీ పేరేంటో తెలుసా..బయటపెట్టిన పవన్!

Modi-Pawan News | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఆప్యాయత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభలో కూడా వీరిద్దరి మధ్య ఉన్న ఆప్యాయత మరోసారి బయటపడింది.

మోదీ మరో పేరును పవన్ బయటపెట్టగా, ప్రసంగం అనంతరం డిప్యూటీ సీఎంకు ప్రధాని చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ఉపముఖ్యమంత్రి పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గతంలో సన్యాసాశ్రమంలో ఉండే రోజుల్లో మోదీని అనికేత్ అని పిలిచేవారనికి తెలిపారు. అనికేత్ పేరుకు పరమ శివుడని అర్ధాన్ని వివరించారు.

ప్రధాని మోదీకి సొంత ఇల్లూ, కుటుంబం లేకపోయినా దేశ ప్రజల్ని సొంత కుటుంబంలా చూసుకుంటున్నారని వెల్లడించారు. అలాగే కోట్లాది మంది ప్రజలకు సొంత ఇళ్లను నిర్మిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్రసంగం ముగిసిన వెంటనే పవన్ ను మోదీ దగ్గరకు పిలిచి అభినందించారు.

అనంతరం చాక్లెట్ ను బహుమతిగా ఇచ్చారు. ఇది చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఇతరులు చిరునవ్వులు చిందించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions