Wednesday 16th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆంధ్రా ఆఫర్’

‘సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆంధ్రా ఆఫర్’

Andhra Cricket Offer To Sun Risers Hyderabad | సన్ రైజర్స్ హైదరాబాద్-హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ అంశంపై విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ మిగిలిన మ్యాచులను విశాఖపట్నం స్టేడియంలో నిర్వహించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పన్ను మినహాయింపు, ఇతర సహకారం అందిస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి ప్రతిపాదన పంపారు.

అయితే ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి విజిలెన్స్ విచారణ జరపాలని ఆదేశించిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులతో హెచ్సీఏ సెక్రెటరీ దేవరాజ్ సమావేశం అయ్యారు.

బీసీసీఐ ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు హెచ్సీఏ కు ఇస్తామని ఎస్ఆర్హెచ్ స్పష్టం చేసింది. గతంలో లాగే అన్ని కేటగిరిల్లో పాసులు ఇవ్వాలని హెచ్సీఏ తెలిపింది. అనంతరం సంధి కుదిరినట్లు ఇరువువైపుల పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions