Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > పాసుల కోసం SRHకు వేధింపులు..సీఎం కన్నెర్ర

పాసుల కోసం SRHకు వేధింపులు..సీఎం కన్నెర్ర

CM Revanth Serious On HCA Controversy | ఉచిత పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఇతర ఉన్నత హోదాల్లో ఉన్నవారు తమను వేధిస్తున్నారని ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన ఆరోపణ చేసిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, వివరాలను సేకరించి విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలను చూస్తూ ఊరుకునేదే లేదని సోమవారం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ మేరకు విచారణ చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాగా, టికెట్ల విషయంలో HCA అధ్యక్షుడు జగ్మోహనరావు తమను పలుమార్లు బెదిరించారని, ఉచిత పాసుల కోసం HCA వేదిస్తున్నట్లు SRH ప్రతినిధి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారికి లేఖను రాశారు. వేధింపులు ఇలానే కొనసాగితే తాము హైదరాబాద్ స్టేడియాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని లేఖలో పేర్కొనడం సంచలనంగా మారింది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions