Thursday 19th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > SRH రికార్డుల మోత..టాప్ 5లో 4 హైదరాబాద్ జట్టువే!

SRH రికార్డుల మోత..టాప్ 5లో 4 హైదరాబాద్ జట్టువే!

SRH Records In IPL | గత సీజన్ లో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే సన్ రైజర్స్ హైదరాబాద్ వేట మొదలుపెట్టింది. ఈ సారి పాత ప్లేయర్లకు తోడుగా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కూడా తొడవడంతో ఆకాశమే హద్దుగా హైదరాబాద్ పరుగుల వరదను పారించింది.

దింతో 2025 లో ఆడిన తొలి మ్యాచులోనే రికార్డుల మోత మోగింది. టాస్ గెలిచి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకోవడం పట్ల ఆ తర్వాత చింతించే ఉంటాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ఆర్ బౌలర్లను ఊచకోత కోసింది. బ్యాటింగ్ చేసిన తొలి ఆరుగురు ప్లేయర్లు 200 స్ట్రైక్ రేట్ కు తగ్గకుండా మెరుపులు మెరిపించారు. 31 బంతుల్లో 67 పెరుగులో హెడ్ మరోసారి ప్రత్యర్థులకు హెడ్ ఏక్ తెప్పించాడు.

ఆ తర్వాత ఇషాన్ కిషన్ విధ్వంసానికి ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగిన కిషన్ 106 పరుగులు చేశారు. దింతో ఐపీఎల్ లో హైదరాబాద్ తరఫున ఆడిన తొలి మ్యాచులోనే తన తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.

ఇషాన్ కు తోడుగా నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ ల మెరుపులతో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోర్ చేసింది. మొదటి స్థానంలో కూడా హైదరాబాదే ఉన్న విషయం తెల్సిందే. కేవలం ఒక్క పరుగుతో తన రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లోనే టాప్-5 అత్యధిక టీం స్కోర్లలో హైదరాబాద్ వే నాలుగు ఉన్నాయి. గత సీజన్ లో ఆర్సీబీ పై చేసిన 287 పరుగులు ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంది.

ఆదివారం రాజస్థాన్ పై చేసిన 286 స్కోర్ రెండవ ప్లేస్ లో, గతేడాది ముంబయి ఇండియన్స్ పై 277 పరుగులు మూడవ స్థానంలో ఉన్నాయి. ఇకపోతే ఢిల్లీ పై కోల్కత్త గతేడాది 272 పరుగులు చేయగా ఇది నాలుగవ స్థానంలో ఉంది. ఐదవ స్థానంలో మళ్లీ హైదరాబాదే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై చేసిన 266 పరుగులతో హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉంది.

ఇకపోతే నిన్నటి మ్యాచ్ లో కేవలం 14.1 ఓవర్ లోనే 200 మార్కును అందుకుని వేగంగా ఈ స్కోర్ ను అందుకున్న జట్టుగా ఆర్సీబీతో సంయుక్తంగా హైదరాబాద్ నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీం స్కోర్, పవర్ ప్లేలో అత్యధిక స్కోర్, 150 పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించడం, ఫాస్టెస్ట్ 100, 250 వంటివి హైదరాబాద్ పేరిటనే ఉన్నాయి.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions