Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > నితిన్ తో కలిసి SRH మ్యాచ్ చూసిన డేవిడ్ వార్నర్

నితిన్ తో కలిసి SRH మ్యాచ్ చూసిన డేవిడ్ వార్నర్

David Warner Attends ‘Robin Hood’ Promotions in Hyderabad | ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ మూవీ మార్చి 28న విడుదలకు సిద్దంగా ఉంది.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబిన్ హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్ యాక్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో నటులు నితిన్, శ్రీలీల తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

మరోవైపు ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ ను నితిన్, డేవిడ్ కలిసి వీక్షించారు. ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో స్టేడియంకు రాలేకపోయిన వీరు ఫోన్లో మ్యాచ్ ను చూశారు.

దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సుదీర్ఘ కాలం పాటు హైదరాబాద్ టీంకు వార్నర్ సారథిగా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోనే హైదరాబాద్ 2016 ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన విషయం తెల్సిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions