Thursday 17th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > KKR vs RCB..వర్షం ముప్పు తప్పదా!

KKR vs RCB..వర్షం ముప్పు తప్పదా!

KKR vs RCB : Kolkata weather report | క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) సిద్ధమయ్యింది. శనివారం నుండి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

కోల్కత్తలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కత్త నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే దానిపై అభిమానుల్లో సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఆక్యూ వెదర్ రిపోర్ట్.

మ్యాచ్ జరిగే సమయంలో వర్షం ముప్పు లేదని స్పష్టం చేసింది. కోల్కత్తలో సాయంత్రం సమయంలో పొడి వాతావరణ ఉన్నప్పటికీ మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయంలో మబ్బులు పట్టే అవకాశం ఉన్నట్లు ఆక్యూ వెదర్ పేర్కొంది. మబ్బులు పట్టినా వర్షం మాత్రం పడే సూచన లేదని రిపోర్ట్ తెలిపింది.

మరోవైపు వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే కనీసం ఐదు ఓవర్ల మ్యాచునైనా ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా కుదరకపోతే మ్యాచ్ ను రద్దు చేసి జట్లకు చెరో పాయింట్ ఇస్తారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions