Sunday 29th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘అన్నీ మహిళలకేనా?..పురుషులకు మందు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి’

‘అన్నీ మహిళలకేనా?..పురుషులకు మందు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి’

JD(S) MLA Krishnappa Demands Free Liquor Bottles For Men | అన్నీ పథకాలు మహిళలకేనా పురుషులకు ఏమీ లేవా అంటూ కర్ణాటక ( Karnataka ) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప.

మహిళలకే నెలకు రూ.2000, వారికే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ ఇస్తున్నారని రాష్ట్రంలోని మందుబాబులకు వారానికి కనీసం రెండు లిక్కర్ బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని ఆయన అసెంబ్లీలోనే డిమాండ్ చేశారు. ప్రస్తుతం జేడీఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్ పట్ల అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

మంగళవారం అసెంబ్లీలో ప్రసంగించిన జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప మహిళలకు చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని కానీ ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.40 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మందుబాబులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఉచితంగా ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల స్పందించిన మంత్రి కేజే జార్జ్ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మీరే ఈ పథకాన్ని అమలు చేసుకోవాలని మండిపడ్డారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions