Wednesday 25th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఢిల్లీ కెప్టెన్ గా అక్షర్ పటేల్..కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ !

ఢిల్లీ కెప్టెన్ గా అక్షర్ పటేల్..కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ !

Axar Patel appointed as Delhi Capitals captain | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ( Indian Premier League ) మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జట్లుతో ప్లేయర్లు కలిసి ప్రాక్టీస్ పెట్టారు.

అయితే గత కొన్నిరోజులుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పై ఉత్కంఠ నెలకొంది. తాజగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ ను ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ టీంకు సారథ్యం వహించనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జట్టులో కేఎల్ రాహుల్ ( KL Rahul ) ఉన్నప్పటికీ అతను కెప్టెన్ బాధ్యతలను సున్నితంగా తిరస్కరించారు. బ్యాటింగ్ పైనే దృష్టి పెట్టాలని భావించాడు. ఈ క్రమంలో ఢిల్లీ అక్షర్ పటేల్ ను కెప్టెన్ గా నియమించింది. ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy )లో అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్ లో వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడారు.

అంతేకాకుండా బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. గత సీజన్ వరకు ఢిల్లీకి సారథ్యం వహించిన రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు ఆక్షన్ లో కొనుకోలు చేసి, కెప్టెన్ గా నియమించింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions