Monday 14th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు’

‘పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు’

Cm Chandrababu Congratulates Deputy Cm Pawan | జనసేన పార్టీ ( Janasena Party ) 12వ ఆవిర్భావ సభకు బారి ఏర్పాట్లు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 2014 మార్చి 14న ఆవిర్భవించిన జనసేన సుమారు 10 ఏళ్ల తర్వాత చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి 21 అసెంబ్లీ స్థానాలను , రెండు పార్లమెంటు సీట్లను గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ ( Strike Rate ) సాధించడంతో జాతీయ స్థాయిలో జనసేన పార్టీ పేరు మారుమోగింది.

ఈ ఘన విజయం నేపథ్యంలో శుక్రవారం నిర్వహిస్తున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో జనసేన పార్టీకి మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విషెస్ తెలుయజేశారు. ‘ జన సేవా నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి, పార్టీ ముఖ్య నాయకులకు, జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions