Raja Singh accuses Telangana BJP leaders of ‘secret meetings’ with CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ బీజేపీ నేతలు రహస్య భేటీలు జరుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు గోశామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.
రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ పార్టీ నేతలు, ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నాయకులు సీక్రెట్ గా మంతనాలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. పార్టీలోని సీనియర్ నాయకులకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని సూచించారు.
రాజసింగ్ ఆరోపణలు నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలతో సీఎం రహస్య సమావేశాలు సిగ్గు చేటని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదన్నారు.