Friday 1st May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గిర్ అభయారణ్యంలో ప్రధాని.. కెమెరా చేతబట్టి..!

గిర్ అభయారణ్యంలో ప్రధాని.. కెమెరా చేతబట్టి..!

PM Modi Takes Lion Safari

PM Modi Takes Lion Safari | ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌ (Gujarat)కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం అక్కడ సోమనాథ్‌ ఆలయాన్ని (Somnath Temple) సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అక్కడి నుంచి సాసన్‌లోని రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించే అటవీ అతిథి గృహం సిన్హ్‌ సదన్‌లో రాత్రి బస చేశారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ లయన్ సఫారీకి వెళ్లారు. గుజరాత్ లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు.

స్థానిక మంత్రులు, అటవీ శాఖ సీనియర్‌ అధికారులతో కలిసి సిన్హ్‌ సదన్‌ నుంచి సఫారీకి బయల్దేరారు. స్వయంగా తానే కెమెరా చేత పట్టి సింహాలను ఫొటోలు తీశారు. అనంతరం జునాగఢలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జునాగఢ్‌ జిల్లాలోని న్యూ పిపాలియా వద్ద 20.24 హెక్టార్లలో నేషనల్‌ రెఫరల్‌ సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైప్ హెల్త్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions