Friday 6th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బావమరిది బాలయ్య నాకంటే సీనియర్’

‘బావమరిది బాలయ్య నాకంటే సీనియర్’

Chandrababu Praises Balakrishna | బావమరిది బాలకృష్ణ ( Nandamuri Balakrishna )పై అభినందనలు వర్షం కురిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ). నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో బాలకృష్ణ సోదరి భువనేశ్వరి, చంద్రబాబు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నవ్వులు పూయించారు. బాలయ్య, భువనేశ్వరి మధ్య తాను నలిగిపోతున్నట్లు చంద్రబాబు చెప్పడంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి. బాలయ్యకు పద్మ భూషణ్ రావడం పట్ల కుటుంబం మొత్తం గర్వ పడుతుందన్నారు.

బాలయ్యది అన్ స్టాపబుల్ ( Unstoppable ) ప్రయాణమని కొనియాడారు. 1974లో బాలయ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, కానీ తాను 1978లో తొలి సారి ఎమ్మెల్యే అయినట్లు గుర్తు చేసిన బాబు తనకంటే బాలకృష్ణ సీనియర్ అని పేర్కొన్నారు.

బాలయ్య పైకి అల్లరిగా కనిపించినా లోపల మాత్రం చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తన్నారు. తనకు బాలయ్య రూపంలో అద్భుతమైన బావమరిది దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

You may also like
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions