Sunday 27th September 2026
12:07:03 PM
Home > తాజా > పద్మ అవార్డుకు బాలయ్య పూర్తి అర్హులు..అల్లు అర్జున్ పోస్ట్

పద్మ అవార్డుకు బాలయ్య పూర్తి అర్హులు..అల్లు అర్జున్ పోస్ట్

Allu Arjun Congratulates Balakrishna on Padma Bhushan Award | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు విశేష కృషి చేసిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెల్సిందే.

సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ), తమిళ నటుడు అజిత్ ( Ajith Kumar ) , శోభన మరియు శేఖర్ కపూర్ తదితరులకు కేంద్రం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్ నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

సినీ రంగానికి చేసిన సేవలకు గాను నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కారానికి పూర్తి అర్హులని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అజిత్ అందుకున్న విజయం కూడా స్ఫూర్తిదాయకం మరియు ప్రశంసనీయం అన్నారు.

శోభన మరియు శేఖర్ కపూర్ కు కళల విభాగంలో పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించడం ఆనందంగా ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మ అవార్డులకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి.. స్పందించిన ముఖ్యమంత్రి!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions